
శ్రీశ్రీశ్రీ అలమేల్ మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగాశనివారం జరిగింది. బండమీది చందుపట్ల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి శతఘటభిషేకం నిర్వహించారు. అగ్ని ప్రతిష్ట, హోమం, గరుడ ముద్ద కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ ముద్దా వెంకన్న, గాయం చంద్రశేఖర్ రెడ్డి, శంకరమద్ది రాకేష్ రెడ్డి, పొనుగోటి కొండల్ రావు, రమేష్ రావు, హరికృష్ణ, చింతమళ్ళ రమేష్, మాజీ ఎంపీపీ ధరావత్ వీరన్న నాయక్,వెన్న మధుకర్ రెడ్డి,కొండపల్లి దిలీప్ రెడ్డి, ఎలిమినేటి అభినయ్, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.