
– ఆరు గ్యారంటీలపై జోరుగా ప్రచారం
నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, చేతి గుర్తుకు ఓటు వేసి తెలంగాణ కాంగ్రెస్ మేనిపేస్టో చైర్మన్, మంథని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబును భారీ మెజార్టీతో గెలిపించాలని సింగిల్ విండో డైరెక్టర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వొన్న తిరుపతి రావు ఓటర్లను కోరారు. మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఎంపిటిసి-2 బూత్ 249లో మంగళవారం సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలని వివరిస్తూ విస్తృతంగా రాత్రి,పగలు అనే తేడాలేకుండా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీ దొంగ హామీలు,మాయమాటలు నమ్మకూడదని,ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి లభిస్తుందన్నారు.మంథనినియోజకవర్ గంలో విద్య,వైద్యం పై శ్రీదర్ బాబు పెద్దపీట వేశారన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు బూడిద సాగర్, ఆకుల శ్రీనివాస్, రవిందర్ రావు,రాములు,రమేష్,గోపి,ఐలయ్య, సురేష్,అశోక్,మాచర్ల రామస్వామి,ఓదెలు,సారయ్య, చెంద్రయ్య, లింగయ్య, ఎల్లయ్య,మల్లేష్,వెంకటేశ్, అగయ్య,వెంకట స్వామి,లచ్చయ్య, రాజయ్య, వెంకయ్య పాల్గొన్నారు.