రాష్ట్ర ప్రగతే తమ ప్రభుత్వ విజన్: మంత్రి శ్రీధర్ బాబు

నవతెలంగాణ – మల్హర్ రావు
గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపబోమని, మూడు దశాబ్దాలుగా స్థిరాస్తి రంగం ఎంతో పుంజుకుందని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు గుర్తు చేశారు. హైదరాబాద్  హోటల్ ఐటీసీ కాకతీయలో సీఐఐ తెలంగాణ ఇన్ ఫ్రా రియల్ ఎస్టేట్ సదస్సును మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించి ప్రసంగించారు. దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విధానపరమైన నిర్ణయాల్లో పారిశ్రామికవేత్తల సహకారం అవసరం అన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు.-డ్యాం సేఫ్టీ అధికారులు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక ఇచ్చారన్నారని తెలిపారు. ప్రజాధనం వృథా కాకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.