
– మాజీ సర్పంచ్ ఎండి మంజూర్
నవతెలంగాణ – రామగిరి
రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు అభివృద్ధి చేసుకుంటూ పోవడమే తప్ప మరొకటి తెలియదని లోంక కేసారం తాజా మాజీ సర్పంచ్ ఎండి మంజూర్ అన్నారు. రామగిరి మండలంలోని కల్వచర్ల నుండి లోంక కేసారం గ్రామానికి నిత్యం ప్రజలు వెళ్లే రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ప్రజల సౌకర్యార్థం కోసం రెండు గ్రామాలకు సంబందించి, లొంక కేసారంలోని సీసీ రోడ్లు డ్రైనేజీలు కోసం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయమని ఐటి మంత్రి శ్రీధర్ బాబును కోరగా వెంటనే సానుకూలంగా స్పందించి నిదులు మంజూరు చేసిన రాష్ట్ర ఐటీ, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుకు మాజీ సర్పంచ్ ఎండి మంజూర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కల్వచర్ల గ్రామానికి రూ. ఒక కోటి 75 లక్షలు, లోంక కేసారం గ్రామానికి రూ.28 లక్షల రూపాయల నిధులు కేటాయించడంతో ఎండి మంజూర్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.