లేబర్ అడ్డాలో శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు 

నవతెలంగాణ-రామగిరి 
రామగిరి మండలం పన్నూరు గ్రామం పరిధిలోని లేబర్ అడ్డ వద్ద   ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు  జన్మదినాన్ని పురస్కరించుకుని రామగిరి మండల మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జాగిరి రజిత ఆధ్వర్యంలో నిరుపేద కూలీలకు చిన్న పిల్లలకు ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, అందజేసి కూలీల గుడిసెలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్లతిరుపతి యాదవ్, ఎంపీపీ దేవక్క కొమురయ్య గౌడ్, మంథని అసెంబ్లీ నియోజవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, రామగిరి మండలం ప్రచార కమిటీ అధ్యక్షులు  ముస్త్యాల శ్రీనివాస్,  సీనియర్ నాయకులు ఎల్లే రామ్మూర్తి, పన్నూర్ గాజుల శ్రీనివాస్, సెంటినరి కాలనీ టౌన్ అధ్యక్షులు కాటం సత్యం, ఎంపీటీసీ కొప్పుల గణపతి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఖండె పోషం బిసి సెల్ మండల అధ్యక్షులు బండారి సదానందం, అసంఘటిత కార్మిక నాయకులు ఉడుత శంకర్,  గాజుల భూమయ్య, నవీన్, ప్రవీణ్, మల్లారెడ్డి, చారి, మహిళా నాయకురాలు శ్రీమతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.