శ్రీధర్ బాబుకు జననీరాజనం..

 – ఎన్నికల  ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు.
 – అడుగడుగునా ఘనంగా స్వాగతం పలుకుతున్న మహిళలు,యువకులు 
నవతెలంగాణ- మల్హర్ రావు: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న జాతీయ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ మేనిపేస్టో చైర్మన్ దుద్దిళ్ల శ్రీదర్ బాబు కు అడుగడుగునా మంథని నియోజకవర్గంలో జనంనీరాజనాలు పడుతున్నారు. పూలవర్షంతో ముఖ్యంగా మహిళలు, యువత బ్రహ్మరథం పడుతూ ఘన స్వాగతం పలుకుతున్నారు.శనివారం ముత్తారం మండలములోని ఖమ్మంపెల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ప్రజలు  ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా  శ్రీదర్ బాబు మాట్లాడారు ప్రతి మహిళ ఖాతాలో మహాలక్ష్మి పథకం కింద రూ.2500, మహిళలందరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500 వంట గ్యాస్ సిలిండర్, పింఛను రూ.4000 లకు పెంచుతామని తెలిపారు. రైతు భరోసా కింద రూ.15000 పెట్టుబడి సాయం, రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12000, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా కార్డులు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తామని తెలిపారు. ఈ నెల 30వ తేదీన జరగబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.