స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖకు చెందిన రాష్ట్ర స్టడీసర్కిల్‌లో సివిల్స్‌ ప్రిలిమినరీ, మెయిన్స్‌ (పదినెలల రెసిడెన్షియల్‌) కోచింగ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు జూలై రెండు ఆఖరి తేదీ (ఐదు రోజులే )గడువు అని స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఇప్పటి వరకు 2,300 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.అత్యధికంగా (174మంది) నల్గొండ జిల్లా నుంచి, సూర్యాపేట (150), ఖమ్మం (130), కరీంనగర్‌ (103), నిజామాబాద్‌ (103) జిల్లాల నుంచి దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు. 70కిపైగా దరఖాస్తులు భద్రాద్రి ,జోగులాంబ, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, నాగర్క ర్నూల్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాల నుంచి వచ్చాయని తెలిపారు. అతి తక్కువ దరఖాస్తులు మేడ్చల్‌ (23), మెదక్‌ (28), జనగాం (30), యాదాద్రి (31) జిల్లాల నుంచి నమోదయ్యాయని పేర్కొన్నారు. రాత పరీక్షను హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌లలో జూలై 9న నిర్వహిస్తా మని తెలిపారు. 100 ప్రశ్నలు కలిగిన జనరల్‌ స్టడీస్‌ పరీక్ష, 40 ప్రశ్నలు కలిగిన సి-శాట్‌ పరీక్ష మొత్తం 140 ప్రశ్నలు కల ఈ పరీక్షను రాసేందుకు మూడు గంటల సమయమిస్తున్నామని తెలిపారు.
రాత పరీక్షను దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమకు అనుకూలమైన, ఎంపిక చేసుకున్న నగరం/పట్టణం లో రాయవచ్చని తెలిపారు. ఈ పరీక్ష ద్వారా వందమందిని ఎంపిక చేస్తా మని అందులో 75 సీట్లు షెడ్యూల్డ్‌ కులాల వారికి, 15 సీట్లు వెనుక బడిన తరగతుల వారికి 10 సీట్లు షెడ్యూల్డ్‌ తెగల వారికి కేటాయించను న్నట్టు తెలిపారు. మొత్తం సీట్లలో 33.33 శాతం మహిళలకు, 5శాతం వికలాంగు లకు చెందుతాయని తెలిపారు. 2022-23వ సంవత్సరంలో 18 మంది ప్రిలిమ్స్‌కు ఉత్తీర్ణులై మెయిన్స్‌ పరీక్ష రాశారనీ, అందులో ముగ్గురు ఇంటర్వ్యూ కు ఎంపిక అయి ఢిల్లీ వెళితే ఒకరికి 885వ ర్యాంకు వచ్చిందని (ఐఆర్‌ఎస్‌ ఇన్‌కం టాక్స్‌) వివరించారు.
అభ్యర్థికి (ఐఆర్‌ఎస్‌ కస్టమ్స్‌) పోస్టు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.ఈ ఏడాది మెయిన్స్‌ కోచింగ్‌ కొర కు 21 మంది ఎంపికయ్యారని తెలిపారు. వారికి స్టడీ సర్కిల్‌లో కోచింగ్‌ ఏర్పాటుతో పాటు ఆన్‌లైన్‌ సబ్‌స్కీప్షన్లను కూడా ఏర్పాటు చేసి ఒక్కో మెయి న్స్‌ విద్యార్థిపై రూ. ఒకటిన్నర లక్షల ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. షషష.్‌రర్‌బసyషఱతీషశ్రీవ.షశీ.ఱఅ నందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.