నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నీట్ ఫలితాల్లో విజయవాడకు చెందిన శ్రీగోసలైట్స్ మెడికల్ అకాడమి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ మేరకు ఆ సంస్థ చైర్మెన్ నరేంద్రబాబు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్ ఫలితాల్లో ఎస్ మల్లిఖార్జునరావు 706 మార్కులు, జి పూజిత 705 మార్కులు, ఎన్ రోహిత్‌సాయి 705 మార్కులను సాధించి రికార్డు సృష్టించారని వివరించారు. కె సంజోగ్ నాయుడు 711 మార్కులు, గోమేధికం నయన్ 705 మార్కుల, సరాబు శ్రీ నిఖిల్, నాము అశ్రిత్, ఎం మయూఖ్‌శర్మ 700 మార్కులను సాధించి విజయకేతనం ఎగరేశారని తెలిపారు. సాధారణ స్కూళ్లలో చదివిన సామాన్య విద్యార్థులను తాము ర్యాంకర్లుగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.