ఎక్కడైతే ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుడిని ఆహ్వానిస్తున్నట్టు, తన పట్ల శ్రద్ధ వహిస్తున్నట్టు భావిస్తారో… ఎక్కడైతే సురక్షిత, ప్రేరణాత్మక నేర్చుకునే వాతావరణముంటుందో… ఎక్కడైతే విస్తతమైన విద్యా అవకాశాలు విభిన్న అనుభవాలను అందించడం జరుగుతుందో… ఎక్కడైతే మంచి మౌలిక సదుపాయాలు తగిన వనరులు అందుబాటులో ఉంటాయో.. అదే ఉత్తమ పాఠశాల.
మేధో పరిజ్ఞానాన్ని మానవీయ విలువలను పెంపొందించడంలో ప్రధానమైన పాత్ర వహించాలి. హుందాగా జీవించడం శ్రమ పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండడం, సాటివారిని సమానంగా చూడడం, న్యాయ బుద్ధితో మెలగడం, హేతువాద దక్పథాన్ని కలిగి ఉండటం, ఇలా… ఎన్నో విలువలు పాఠశాలలో నేర్చుకునే అవకాశం ఉండాలి. ఉత్తమ విద్యా సంస్థలు, ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నప్పుడే ఉత్తమ విద్యార్థులు తయారవుతారు. ఆవిధంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ బాలోత్సవం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా… ఉపాధ్యాయదినోత్సవ వేళా.. ఆట పాటల మేళా.. సెప్టెంబర్ 3 న సుందరయ్య కళానిలయంలో నిర్వహించింది.
ఉపాధ్యాయులమని మరిచి పిల్లలుగా మారి ఏంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా .. ఆట పాటలలో అదరహోఅని నిరూపించారు టీచర్లు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తీరొక్క ఆట, పాటలు కనుల పండుగగా సాగింది ఈ వేడుక.
ప్రస్తుత సమాజంలోని సమస్త రోగాలకు చికిత్స చేయగల అపర ధన్వంతరులు మన ఉపాధ్యాయులు. విద్యా ఫలాలు అందరికీ అందించే విజ్ఞాన మూర్తులు, సమాజం చెయ్యెత్తి జై కొట్టే విధంగా ఉన్నత విద్యా ప్రమాణాలను నేలకోల్పే ఆచార్యులు వీరు. విద్యార్థులకు విజ్ఞానం, సామర్థ్యం, సత్ప్రవర్తనను పెంపొందించే పండితులు. ఇంతటి పవిత్రమైన ఉపాధ్యాయ వత్తి చాలా ఒత్తిడితో కూడుకున్నది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కువ మంది మహిళలే పనిచేస్తున్నారు. అతి తక్కువ వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకపోయినా సామాజిక భద్రత గురించి కూడా పట్టించునే పరిస్థితి లేదు వీరికి. సెలవు రోజుల్లో కూడా పాఠశాలకు వెళ్ళడం, విద్యార్థుల కోసం ఇల్లిల్లు తిరగడం లాంటి పనులు చేసినా.. కనీస హక్కుల పరిరక్షణ చట్టాలు కూడా లేకపోయినా… బోధన, బోధనేతర పనులు… ఇలా అనేక రకాల ఒత్తిడికి గురవుతున్నారు. ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లినా బతుకుదెరువు కోసం తప్పనిసరి స్థితిలో నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే ఉపాధ్యాయులకు ఈ సజనోత్సవాలు నూతనోత్సాహాన్ని నింపాయి. కొందరు తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తుండగా.. మరికొందరు ఉపాధ్యాయులు తిలకిస్తూ, కేరింతలు కొడుతూ వారిని ప్రోత్సహించారు. ఆట పాటలు ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను నిర్వాహకులు.
లఘు నాటికలు, జానపద నత్యాలు, పాటలు, వ్యాసరచన, క్విజ్, బతుకమ్మ, కోలాటం, దాండియా, ఏకపాత్రాభినయం… ఇలా అనేక సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
52 పాఠశాలలు, 300 మంది ఉపాద్యాయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ప్రతి స్కూల్ ఉపాధ్యాయులు సొంత ఖర్చులతో ప్రత్యేకమైన దుస్తులు కుట్టించుకుని చక్కగా ముస్తాబై వివిధ రకాల వేషాధారణలతో బతుకమ్మలు పట్టుకుని వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తమదైన పద్ధతిలో ఈ వేడుకకు సమయపాలన పాటిస్తూ తరలి వచ్చారు.
చిన్నప్పుడు ఆడిన ఆట పాటలు గుర్తు చేసుకున్నట్టు.. అన్ని రకాల ఆట పాటలలో పోటీ పడ్డారు. ఎంతగా అంటే… 62 ఏళ్ల ఉపాధ్యాయురాలు వేదిక పై వచ్చి ‘ఏ పాటకైనా నేను రెడీ’ అని ఏ రకమైన డాన్స్ అయినా చేస్తాను అని చెప్పి మరీ నృత్యం చేసింది. ఆమె చేసిన నత్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నది. మంత్రముగ్ధులైన పెద్దలు, పిన్నలు ఆమెకు అభినందనలు తెలిపారు. బహుమతులు ఇచ్చి ఆమెను సముచితంగా గౌరవించారు.
‘మనుషులలో ఆవహించిన, అర్థం కాని అంతర్గత శత్రువే ఈ మూఢనమ్మకాలు’ అంటూ అనునిత్యం జరుగుతున్న మూఢనమ్మకాల పై స్కిట్ రాసుకుని, తామే దర్శకత్వం వహించి, సహజ నటనతో మూఢాచారాల గుట్టురట్టు చేస్తూ అద్భుతమైన లఘు నాటికలను ప్రదర్శించి బహుమానాలు అందుకుంది మరొక బృందం.
తెలంగాణ బాలోత్సవం పిల్లలు చదువుల తల్లి సావిత్రి భాయి ఫూలే స్కిట్ వేశారు. సావిత్రి భాయి మనువాదుల మధ్య సంభాషణలు, అవమానకర సన్నివేశాలు 200 ఏళ్ల చరిత్రను వెనక్కితీసుకపోయి ఆశ్చర్య పరిచారు. ఇండియన్ అకాడమీ హైస్కూల్ పిల్లలు ‘భారతదేశ చరిత్ర’ను లౌకిక సంస్కతిని, సర్వ మతాల సారాన్ని వివరిస్తూ… ప్రతిజ్ఞకు ప్రమాదం వాటిల్లిందని సోదరత్వం, దేశ సమైక్యతను చాటిచెప్పే చక్కటి లఘు నాటిక ను 12 నిమిషాల్లో ప్రదర్శించారు. కొండను ఉండగాచేసి ప్రదర్శించిన ఈ విద్యార్థుల తీరును పలువురు ప్రశంసించారు. దేశభక్తి గీతాలు, అభ్యుదయ భావాలతో నిండిన పాటలను పోటీపడి మరీ ఆలపించారు.
ఎన్నో ఏళ్లుగా ఇలాంటి సజనోత్సవాల కోసం ఎదురు చూస్తున్నామని, ఇరుకు గదుల్లో .. ఏడంతస్తుల మేడల్లో చదువుకుంటున్నామని ఆవేదన చెందారు. పిల్లలకు ఎటువంటి ఆట స్థలాలూ లేవు. వేదికలు లేవు. వారికి అవకాశాలు ఇస్తే చాలు… ఆకాశం అంచులు తాకుతామని నిరూపించారు ఈ వేదికలో.
ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులలో కవులు, కళాకారులు, రచయితలు, ఆర్టిస్ట్‌లు, బాహు భాషాపండితులు, నిపుణులు… ఇలా అన్ని రకాల నిష్ణాతులున్నారు. వాళ్ళు ఆడిన ఆట పాటలే చైతన్యపు పూదోటలయ్యాయి. ఆటపాటల అవసరాన్ని అన్ని పాఠశాలల యాజమాన్యం గుర్తించేలా చేసింది ఈ వేడుక. పాల్గొనని పాఠశాలలు తప్పకుండా పాల్గొనాలనే ఉత్తేజాన్ని కలిగించింది.
ఇలాంటి సజనోత్సవాలు నూతనోత్సాహాన్ని నింపుతాయని, ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహించాలని తెలంగాణ బాలోత్సవ కమిటీకి సూచించారు వచ్చిన వారు.
ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, రాజస్థానీ, కేరళ, తెలుగు 6 భాషలు మాట్లాడే అపురూపమైన ప్రతిభావంతులు ఉపాధ్యాయులలో ఉన్నారు. ఈ వేదికలో వారి ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి కషి తెలంగాణ బాలోత్సవం చేసినందుకు వారంతా సంతోషాన్ని వ్యక్తపరిచారు.
తెలంగాణ అంటే ఆటపాటల సంస్కతి. ప్రతి మనిషిలో ఆడే పాడే గుణం ఉంటుంది. ఆటపాటలకు వేదికలు లేకపోవడంతో తమ సజనను ప్రదర్శించ లేకపోతున్నామని, ఇలాంటి వేదికలు నిరంతరం కల్పించాలని సూచించారు పాల్గొన్నవారంతా. ఏకపాత్రాభినయాలు, స్వాతంత్ర సమరయోధుల వేషాధారణ, రాజస్థానీ హిందీ, ఉర్దూలోనూ, ఆట పాటలలో బెస్ట్ త్రీ బహుమతులు అందజేశారు నిర్వాహకులు. చివరిగా అందరూ గ్రూప్ ఫోటోలు దిగారు. సర్టిఫికెట్స్ బహుమతులతో ఆనందంగా ఇంటికి వెళ్లారు. వచ్చే సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో… మెరుగైన ఆట పాటల లతో…. వస్తామని కతజ్ఞతలు తెలియజేస్తూ వెళ్ళారు.
– భూపతి వెంకటేశ్వర్లు, 9490098343