– మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
మకావు: మకావు బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో శ్రీకాంత్ 21-14, 21-15తో ఇజ్రాయేల్‌కు చెందిన డానియేల్‌ను చిత్తుచేశాడు. వరుససెట్లలో నెగ్గిన శ్రీకాంత్.. ప్రి క్వార్టర్స్‌లో భారత్‌కే చెందిన అస్మిత్ శెట్టితో తలపడనున్నాడు. ఇతర పోటీల్లో అస్మిత్ శెట్టి 21-13, 21-5తో భారత్‌కే చెందిన మిశ్రాను ఓడించగా.. సమీర్ వర్మ, మిథున్ మంజునాథ్, సుబ్రహ్మణ్యన్, చిరాగ్ శేన్ తొలిరౌండ్‌లో ఓటమిపాలయ్యారు. మంజునాథ్ 12-21, 15-21తో హాంగ్(చైనీస్ తైపీ), సుమిత్ వర్మ 21-18, 11-21, 13-21తో వాంగ్(చైనా) చేతిలో పోరాడి ఓడారు. మరో పోటీలో చిరాగ్ సేన్ 12-21, 17-21తో అగస్(హాంకాంగ్) చేతిలో, సుబ్రమణ్యన్ 14-21, 21-10, 12-21తో థారులాండ్‌కు చెందిన తీరరస్టకుల్ చేతిలో పోరాడి ఓడారు. ఇక మహిళల సింగిల్స్‌లో తస్మిన్ మీర్ మినహా.. మిగిలిన షట్లర్లంతా తొలిరౌండ్‌లోనే నిష్క్రమించారు. తస్మిన్ తొలిరౌండ్‌లో 15-21, 21-18, 22-20తో భారత్‌కే చెందిన సిహాగ్‌ను ఓడించి రెండోరౌండ్‌కు చేరింది.