
కృష్ణాష్టమి సందర్భంగా డిండి మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ వన్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులు కృష్ణుడు, రాధా, సత్యభామ వేషధారణ ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ బల్ముల చంద్రకళ మాట్లాడుతూ… అంగన్వాడి స్కూల్ పిల్లలతో అనేక కార్యక్రమాలు నిర్వహింస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించా మన్నారు. పిల్లలతో కృష్ణాష్టమి పండుగ ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి వేడుకలు మరెన్నో చేస్తామని ఆమె అన్నారు. అంగన్వాడి స్కూల్ లకు రాష్ట్ర ప్రభుత్వము నిధులు కేటాయించాలన్నారు. అంగన్వాడి ీచర్లకు వర్కర్లకు జీతము పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్కర్ నాగమణి, రజిత, పుష్పలత, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.