శ్రీలక్ష్మీ నారాయణ ఆలయ భూముల కౌలు వేలం

– ఆలయ కమిటీ ఛైర్మన్ చాట్ల గోపాల్ విజ్ఞప్తి

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయ భూములు ఈనెల తొమ్మిదిన మంగళవారం ఉగాది రోజున ఉదయం 10 గంటలకు ఆలయ భూముల కౌలు వేలంపాట ఆలయ ఆవరణంలో నిర్వహించడం జరుగుతుందని ఆలయ భూముల కౌలు కోసం గ్రామ వ్యవసాయదారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ చైర్మన్ చాట్ల గోపాల్ గ్రామ కౌలు దారులకు వ్యవసాయదారులకు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతుంది. ఆలయ భూములు ప్రతి సంవత్సరం ఉగాదికి వేలంపాట దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల అనుమతితో, ఆలయ భూములు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కౌలు వేలంపాట నిర్వహించడం జరుగుతుందని, ఈ ఏడాది కూడా ఈనెల తొమ్మిదిన ఉగాది రోజున ఉదయం10 గంటలకు ఆలయ ఆవరణంలో ఆలయ భూముల కౌలు వేలం పాట జరుపబడుతుందని, కౌలు దారులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ భూముల కు అధిక ఆదాయం వచ్చే విధంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ చైర్మన్ గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. శ్రీ లక్ష్మీనారాయణ ఆలయ భూముల కౌలు వేలంపాట కోసం గ్రామంలో దండోరా వేయించారు.