
నవతెలంగాణ హైదరాబాద్: శ్రీమయూరి నృత్యాలయ, కూకట్‌పల్లి హైదరాబాద్ సాంస్కృతిక సేవాసంస్థ ఆధ్వర్యంలో గురువందన నృత్యోత్సవం రవీంద్రభారతిలో నిర్వహించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయం, నిలబెట్టాలన్న సంకల్పంతో ఉన్న తల్లిదండ్రులకు అభినందనలు అని కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలు డాక్టర్ ఎస్పీ భారతి అన్నారు. రవీంద్ర భారతిలో గురు వందన నృత్యోత్సవం ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భముగా ఆమె మాట్లాడుతూ, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి రామ్ కుమార్, శ్రీదేవీ, కుమారి నందితను అభినందించారు. నృత్యం, సంగీతం ఏ విద్య ఐనా కూడా మన శాస్త్రం దాని అంతరార్ధము తెలిసి ఉండాలని చిన్నారులకు సూచించారు. ప్రముఖ కూచిపూడి నాట్య గురువు వేదాంతం రాదేశ్యాం కూచిపూడి కళకు చేసిన సేవలు గురించి కొనియాడారు.

శ్రీ మయూరి నృత్యాలయ కూకట్ పల్లి,హైదరాబాద్ సాంస్కృతిక సేవ సంస్థ 2009లో ప్రారంభమై కళలలో ముఖ్యంగా నాట్యరంగంలో శిక్షణ పొందుతున్న ఎంతో మంది చిన్నారి కళాకారులకు ప్రముఖ ప్రోత్సాహకంగావేదికల యందు ప్రదర్శన అవకాశాలను కల్పిస్తూ వారి ప్రతిభకు బాట వేస్తూ. ప్రాచీన కళా కేంద్ర చండీగర్ ద్వారా నృత్య విభాగంలోనూ, కూచిపూడి, భర్త నాట్యం మరియు సంగీతంలో అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నామని శ్రీ మయూరి నృత్యాలయ ఆర్గనైజర్ ఆర్ యస్ యస్ రామ్ కుమార్ తెలిపారు. అనంతరం సంస్థ ఆధ్వర్యంలో నాట్యభారతి, నాట్యజ్యోతి పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ భారతి, వేదాంతం రాధేశ్యాం, గౌరవఅతిథిగా హైదరాబాద్ అడిషనల్ డీజీపీ రామ్‌దాస్ తేజోవత్, విశిష్ట అతిథులుగా ప్రముఖ సినీనటి రాగిణి హాజరయ్యారు. నాట్యశ్రీ ఉదయశ్రీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా రామ్‌కుమార్, నందితలక్ష్మి కార్యక్రమం ఆర్గనైజర్స్‌గా వ్యవహరించారు. కార్యక్రమం విజయవంతంగా కొనసాగడానికి శ్రీదేవి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో నాట్యగురువులు సాయి మాధవి, విమల నీలం, చేత సత్యనారాయణ, ఉదయశ్రీ, లలిత ధనలక్ష్మి, దీపిక మధుబాబు, భాను ప్రమీల, కృష్ణ కుమారి, స్వప్న ప్రవీణ్, భవానీ, మాధురి, సేవిత, ప్రశాంతి, అంజలిరెడ్డి, సాయిశిల్ప, మేఘన, శివాని, తేజశ్రీ, ప్రశాంత్, శృతి, స్వప్నలత పాల్గొన్నారు.