తెలుగు పరిశ్రమలో బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌లను అందించిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నేతత్వంలోని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి 47వ ప్రాజెక్ట్ కోసం శ్రీమురళితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ‘బఘీర’ ఘనవిజయం తర్వాత శ్రీమురళి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మాత విశ్వ ప్రసాద్ నేతత్వంలో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ ఇప్పటికే అభిమానులు, విమర్శకులలో క్యురియాసిటీని పెంచింది. ఈ స్పెషల్ మూమెంట్‌కి గుర్తుగా, అలాగే శ్రీమురళి పుట్టినరోజును పురస్కరించుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇదిలా ఉంటే, శ్రీమురళి పుట్టినరోజు సందర్భంగా బ్రాండ్ స్టూడియోస్ హాలేష్ కోగుండి టీమ్ రూపొందిస్తున్న కొత్త సినిమాకి ‘పరాక్’ అనే టైటిల్‌ని అనౌన్స్ చేశారు. ఇది అభిమానులకు, ప్రేక్షకులకు గొప్ప విజువల్ ట్రీట్ అవుతుందని, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ మార్చిలో సెట్స్‌పైకి రానుంది అని మేకర్స్ తెలిపారు.