
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో నిజామాబాద్ నగరానికి చెందిన నారాయణ పాఠశాల విద్యార్థిని శ్రీనిధి రికార్డు పొందిందని నారాయణ పాఠశాల ఏజీఎం శివాజీ తెలిపారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల నారాయణ పాఠశాల ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ పాఠశాల ఏజీఎం శివాజీ మాట్లాడుతూ.. పాఠశాలకు చెందిన శ్రీనిధి పిపి 1 విద్యార్థిని, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అర్హత సాధించిందన్నారు. చిన్నారి ప్రయత్నాలను నైపుణ్యాలను సాహసాన్ని గుర్తించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు సాధించిందని, అందుకు తమ పాఠశాల తరఫున అభినందిస్తున్నామన్నారు. నాలుగు సంవత్సరాల విద్యార్థిని చిన్న వయసులోనే 28 భారతీయ రాష్ట్రాల రాజధానులు పేర్లు అడగగానే చెబుతుంది అలాగే, 9 జాతీయ చిహ్నాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, గాయత్రి మంత్రం, గణితంలో రెండో ఎక్కాలను చదవడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కూడా సాధించిందని తెలిపారు. తమ పాఠశాలలో ఇలాంటి విద్యార్థులు చదవడం తమ పాఠశాలకే గౌరవ కారణమని అన్నారు. తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులలో ఎలాంటి ప్రతిభ ఉన్న వారిని గుర్తించి వారిని ఆ రంగాలలో ప్రోత్సహిస్తామని అయన పేర్కొన్నారు. విద్యార్థిని శ్రీ నిధితో పాటు,తల్లిదండ్రులు వెంకటేష్ సుష్మ రాణి, లను నారాయణ పాఠశాల తెలంగాణ జిఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం శివాజీ పాటిల్, ప్రిన్సిపల్ జోష్ణ ఉపాధ్యాయ బృందం అభినందించి సన్మానించారు.