నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల పరిషత్ అధికారిగా (ఎంపీడీఓ) శ్రీనివాస్ పదవి బాద్యతలు తీసుకోవడం జరిగిందని ఎంపీవో యాదగిరి తెలిపారు. ఈ సంధర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలాన్ని, జీపీలన్నిటికి ఆభివృద్ది పథంలో కోనసాగేల అందరి కృషి, సహకారం తీసుకుని ముందుకెల్తానని, అలసత్వంగా ఉండే అధికారుల పైన ఎటువంటి ఒత్తిళ్లరు రాజీ పడేది లేదని పేర్కోన్నారు. జీపి సెక్రట్రిలు తమతమ జీపీలలో సమయపాలన పాటీస్తు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సమస్యలున్న వారు నేరుగా తనకు తెలియచేయాలని, సాధ్యసాధ్యాలను పరీశీలించి, వెను వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.