
రజక సంఘం మండల అధ్యక్షుడిగా నంగునూరి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య మాట్లాడుతూ రానున్న రోజులలో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షుడు భీంరెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ శెట్టి సుధాకర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చింతకింద శంకర్, ఉపాధ్యక్షుడు గూడ స్వామి, ప్రధాన కార్యదర్శి మంద దయాకర్, బోయిని అశోక్, పోలు శ్రీనివాస్, మల్యాల శ్రీనివాస్, పద్మారెడ్డి, తూటి రాజిరెడ్డి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి అంకుష్, బైరీ సుధాకర్, బందెల బాలకిషన్, ముంజ శ్రీనివాస్, బట్టు పద్మారెడ్డి, చెప్యాల రవి, జాప రాజిరెడ్డి, జనార్దన్ చారి, నారాయణరెడ్డి, గుడిపాటి లింగారెడ్డి, వట్టిపెల్లి లింగారెడ్డి, చాడ రాజిరెడ్డి, ముంజ శ్రీనివాస్, ముంజ ప్రకాష్, రాచూరి పరమేష్, వాసాల సంపత్, తదితరులు పాల్గొన్నారు.