
పెయింటర్ల సంఘం మండల నూతన అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన జలగం శ్రీనివాస్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా దంతాలపల్లి సతీష్, ప్రధాన కార్యదర్శిగా సోమారపు పరుశురాం, కార్యదర్శిగా దంతాలపల్లి జయరాజ్, సలహాదారులుగా గుంటుక యాకన్న, దంతాలపల్లి సోమనర్సయ్య, కోశాధికారిగా దంతాలపల్లి శ్రీకాంత్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెయింటర్స్ యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెయింటర్లు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతానని చెప్పారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.