బాధిత కుటుంబానికి శ్రీనివాస్ పరామర్శ

నవతెలంగాణ పెద్దవంగర: మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన బచ్చు లచ్చయ్య వృద్ధాప్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్, లచ్చయ్య భౌతికయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట గ్రామ పార్టీ అధ్యక్షడు బొమ్మెరబోయిన రవి, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గద్దల స్వామి, సుధాకర్, యూత్ అధ్యక్షడు ఆలేటి మధు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కాసోజు సోమాచారి, గద్దల ఉప్పలయ్య, గద్దల వెంకన్న, మహంకాళి వెంకన్న, గద్దల సోమనర్సయ్య, గద్దల వెంకన్న, ఎల్లయ్య, వెంకటేష్, శివకుమార్, రాజు, నరసింహా చారి, సంపత్ తదితరులు ఉన్నారు.