మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన బొమ్మెరబోయిన సోమన్న (40) అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్, సోమన్న భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటానని ధైర్యం కల్పించారు. ఆయన వెంట గ్రామ పార్టీ అధ్యక్షుడు బొమ్మెరబోయిన రవి, బోదెపల్లి సందీప్, బెల్లంకొండ సాగర్, గద్దల సుధాకర్, చింత భాస్కర్, బాను, సాయి, గ్రామ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాశోజు సోమచారీ ఉన్నారు.