
అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ రాష్ట్ర నాయకులు అలాగే జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఆయనతోపాటు పెద్ద ఎక్లారా ఎంపీటీసీ సభ్యులు శంకర్ పటేల్ ఆ గ్రామ పెద్దలు తదితరులు కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. పెద్ద ఎక్లార గ్రామానికి చెందిన మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యులు గ్రామ పెద్దలు చేరికతో పెద్ద ఎక్లార గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయింది.