
నవతెలంగాణ – తొగుట
విద్యారంగా అభివృద్ధి పాఠశాలలు, కళాశాలలలో మౌలిక వసతుల కల్పన కోసం అహర్నిశలు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రాంపూర్ జూనియర్ కళాశాల రూ. 75 లక్షల, మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ విద్యాలయ రూ. 27 లక్షలు, తుక్కాపూర్ ఎక్స్ రోడ్ వద్ద పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం రూ 14.70 లక్షలు వ్యయంతో ప్రహరీ గోడల నిర్మాణం కోసం స్థానిక ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగా అభివృద్ధి కోసం పాఠశాల, కళాశాలలలో మౌలిక వసతుల కల్పన కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపా రు. ఈ అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో అధి కారంలో ఉన్న సమయంలో మండలాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి రావడంతో మండలాన్నీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, మాజీ ఎంపీపీ గంట రేణుక రవీందర్, మాజీ సర్పంచులు చెరుకు విజయ్ రెడ్డి, పాగాల కొండల్ రెడ్డి, బుర్ర అనిత నర్సింహులు గౌడ్, కొంగరి నర్సింలు, మాజీ వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కనకయ్య యాదవ్, ఫిషర్మెన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రేపాక తిరుపతి, జిల్లా నాయకులు యెన్నం భూపాల్ రెడ్డి, భూస నిరం జన్ రెడ్డి, పబ్బతి మల్లారెడ్డి, ఉప్పలయ్య, జీడిపల్లి స్వామి, లింగాల కృష్ణ, అన్సార్ తదితరులు పాల్గొ న్నారు. అనంతరం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, కుర్మ సంఘం మండల అధ్యక్షుడు దేవు నూరి పోచయ్య కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.