
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, ప్రజల్లో మమేకమై కృషి చేస్తానని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. మాజీ మంత్రివర్యులు మహమ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్,ఎల్లారెడ్డినియోజక వర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వడ్డే పల్లి శభాష్ రెడ్డి, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి చొరవతో నాపై నమ్మకం ఉంచి, మండల పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.