బాధిత కుటుంబాలను చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శ  

నవతెలంగాణ- దుబ్బాక రూరల్
ఇటీవల దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేటలో అనారోగ్యంతో మృతి చెందిన సిద్దుల పుల్లయ్య, బరిగె సత్తయ్య కుటుంబాన్ని ఆదివారం దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అనంతుల శ్రీనివాస్, ఉషయ్య, రాజి రెడ్డి  తదితులున్నారు.