కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా: శ్రీనివాస్

నవతెలంగాణ- పెద్దవంగర: కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటానని ఆ పార్టీ మండల సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని అవుతాపురం గ్రామానికి చెందిన బెల్లంకొండ అనిల్ (38) అనారోగ్యంతో మృతి చెందారు.‌ విషయం తెలుసుకున్న ఆయన, మృతుని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని భరోసా కల్పించారు. ఆయన వెంట గ్రామ పార్టీ అధ్యక్షుడు బొమ్మెరబోయిన రవి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గద్దల స్వామి, సుధాకర్, బొమ్మెరబోయిన ప్రభాకర్, సోమయ్య, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కాసోజు సోమాచారి, చాట్ల లక్ష్మీనారాయణ, కాసోజు నరసింహా చారి, గదెరాజు వెంకటేష్, ఓరుగంటి శివకుమార్ గౌడ్, బొమ్మెరబోయిన రాజు, పాలబిందెల సంపత్, పగిడిపాల హరీష్,. బొదేపల్లి సందీప్, పగిడిపాల గోపాల్, బచ్చు ప్రభాకర్ తదితరులు ఉన్నారు.