నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన కరీంనగర్ జిల్లా బీఎస్పీ కార్యవర్గ సభ్యుడు పెద్దొల్ల శ్రీనివాస్ యాదవ్ బీఎస్పీ పార్టీకి రాజీనామ చేసి వైదొలుగుతున్నట్టు శుక్రవారం తెలిపారు. బీఎస్పీ పార్టీ ఏర్పాటుచేసిన సిద్దాంతాన్ని జాతీయ స్థాయి నాయకులు విస్మరించి మత తత్వ పార్టీకి వత్తాసు పలకడాన్ని వ్యతిరేకిస్తూ బీఎస్పీ నుండి వైదొలుగుతున్నట్టు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.