బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన శ్రీనివాసరావు 

– నూతనంగా నిర్మించే పార్టీ కార్యాలయానికి నామకరణం 
– చకిలం శ్రీనివాసరావు వర్ధంతి కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
బడుగు,బలహీన వర్గాలకు ఆనాడు చకిలం శ్రీనివాసరావు అండగా ఉండి పెద్దదిక్కుగా నిలిచాడని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతవత్ శంకర్ నాయక్ అన్నారు.నల్లగొండ మాజీ,ఎంపీ దివంగత నేత చకిలం శ్రీనివాసరావు 28వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.రామగిరిలోని శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున జిల్లాలో నూతనంగా నిర్మించే పార్టీ కార్యాలయానికి శ్రీనివాస్ రావు భవన్ గా నామకరణం చేస్తామని తెలిపారు.ఈ విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.చకిలం శ్రీనివాసరావు ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు.  పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చకిలం శ్రీనివాసరావు కుమారుడు చకిలం అనిల్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల కోటి, అల్లి సుభాష్ యాదవ్, జూలకంటి సైదిరెడ్డి, పోలె జయకుమార్, గాలి నాగరాజు, గాలి రవి, మామిడి కార్తీక్, పాదం అనిల్, కంచర్ల ఆనంద్ రెడ్డి, దాసరి శంకర్, దాసరి విజయ్, చింతపల్లి గోపాల్, మనిమద్దే సాయి తదితరులు  పాల్గొన్నారు.