
తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి,కాంగ్రెస్ నేసనల్ మేనిపేస్టో చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు గురువారం మంథని నియోజకవర్గంలో పలు శుభ కార్యాలయాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నూతన దంపతులను ఆశీర్వదించారు. పెండ్యాల సురేష్ కుమారుని ఉపనయన (వడుగు), రామోజీ సుజాత శేషగిరి చార్యులు కుమార్తె వివాహ వేడుక, పుట్ట సుధాకర్ పటేల్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి, పుప్పాల శ్రీనివాస్ కుమార్తె వివాహ ముస్తాబు వేడుక, తమ్మిషెట్టి కిరణ్ రాశి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.