
మహాముత్తారం మండలం నిమ్మ గూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహాముత్తారం మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు,మండల అధ్యక్షురాలు జాడి కీర్తి బాయి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే ఆదివారం రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు కారు ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బోర్లగూడెం స్వగ్రామంలో జాడి కీర్తిబాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి,ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.అధైర్య పడవద్దు కాంగ్రెస్ పార్టీ,ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.