తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు మంగళవారం మల్హర్, కాటారం మండలాల్లో పలు శుభకార్యాలయాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు నూతన వదువరులను అశ్విర్వదించారు. అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి భూపాలపల్లి యోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గజ్జెల రజిత సమ్మయ్య లను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఎడ్లపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు జంగిడి సమ్మయ్య, నాయకులు రాహుల్, లక్ష్మీ రాజాం, బాపు పాల్గొన్నారు.