తూర్పు డివిజన్లో శ్రీనుబాబు విస్తృతంగా పర్యటన

నవతెలంగాణ –  మల్హర్ రావు
తెలంగాణ ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు కాటారం తూర్పు డివిజన్లో బుధవారం విస్తృతంగా పర్యటించారు. మహాముత్తారం మండలంలోని నిమ్ముగూడెం, మినాజీపేట, బొప్పారం గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పలు బాధిత కుటుంబాలను పరామర్శించి, అధైర్య పడవద్దు, ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అనంతరం పలు శుభకార్యాలకు హాజరైయ్యారు. కాటారం మండల కేంద్రంలో రాజరాజేశ్వర ప్రయివేటు ఆసుపత్రిని సందర్శించి, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,యూత్ నాయకులు పాల్గొన్నారు.