బాధిత కుటుంబాలకు శ్రీనుబాబు పరామర్శ

బాధిత కుటుంబాలకు శ్రీనుబాబు పరామర్శనవతెలంగాణ: మల్హర్ రావ:-
మండలంలోని కొండంపేట గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు ఏనుగు నాగరాని లక్ష్మి నారాయణ తండ్రి ఏనుగు కిష్టయ్య తోపాటు పలువురు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పలు బాధిత కుటుంబాలను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు పరామర్శించారు.అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అనంతరం మృతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోటు ప్రభాకర్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్, రాజేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు