చేతన్ కష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ధూం ధాం’. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించారు. సాయి కిషోర్ మచ్చా దర్శకుడు. ఈ నెల 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. గీత రచయితగా 20 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో రామజోగయ్య శాస్త్రిని చిత్ర బృందం సన్మానించింది. నిర్మాత రామ్ కుమార్ మాట్లాడుతూ, ‘మా అబ్బాయి చేతన్‌ను హీరోగా ఈ సినిమా మరో మెట్టు ఎక్కిస్తుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మీరంతా సకుటుంబంగా వచ్చి సినిమా చూడండి’ అని అన్నారు. ‘ఈ సినిమా చూసి బాగా నవ్వుకుంటారు. మీ టికెట్ ధరకు సరిపడా నవ్వులు అందిస్తాం. శ్రీను వైట్ల కామెడీని, వైవీఎస్ సాంగ్స్ స్టైల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీ చేశాను’ అని డైరెక్టర్ సాయికిషోర్ మచ్చా చెప్పారు. హీరో చేతన్ కష్ణ మాట్లాడుతూ, ‘హిలేరియస్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. మా సినిమాకు ప్రేక్షకులు ఒక్క అవకాశం ఇవ్వండి. సినిమా బాగా లేకపోతే అందరికీ చెప్పండి, బాగుంటే పది మందికి చెప్పిండి. మౌత్ టాక్ కంటే గొప్ప ప్రచారం లేదు. మీకు నవ్వులు గ్యారెంటీ’ అని చెప్పారు.
టాలీవుడ్‌లో 20 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్న మా రామజోగయ్య శాస్త్రికి శుభాకాంక్షలు. ఈ సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫస్టాప్ ప్లెజంట్‌గా ఉండి, సెకండాఫ్ హిలేరియస్‌గా ఉందని ఈ సినిమాకు వర్క్ చేసిన నా ఫ్రెండ్స్ చెప్పారు. మా ‘రెడీ’ సినిమా అప్పుడు కూడా సెకండాఫ్ హిలేరియస్‌గా ఉందనే టాక్ బిఫోర్ రిలీజ్‌కే వచ్చింది. రెడీ సినిమాలా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ ఎంటర్‌టైనర్ కావాలి.
– డైరెక్టర్ శ్రీను వైట్ల