
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీపాద రావు 87 వ జయంతి వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బుధవారం మహాముత్తారం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు పక్కల సడవలి ఆధ్వర్యంలో శ్రీపాద రావు వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, బీసీ సెల్ మహిళా నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.