శ్రీపాద ట్రస్ట్ ఛైర్మన్ శ్రీను బాబు జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – మహాముత్తారం 
శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు  జన్మదిన సందర్భంగా మహా ముత్తారం మండల కేంద్రంలో  యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ వంశిరాజ్. ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..దివంగత నేత అజాతశత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు అకాల మరణం పొందిన తర్వాత శ్రీపాద రావు  ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని శ్రీధర్ బాబు  రాజకీయాలలోకి అరంగేట్రం చేశారు. తండ్రి ఆశయ సాధనలో అన్నకు వెన్నంటు  ఉంటూ అనునిత్యం ప్రజలకి అందుబాటులో శ్రీను బాబు  ఉండి ప్రజా సమస్యలని పరిష్కరించడం లో ముందుంటారు. ప్రతి కార్యకర్తనీ తన సోదరభావంతో భావించి ఎ కష్టం వచ్చిన నేనున్నానంటూ వెనకుండి ప్రోత్సహిస్తాడు అలాంటి గొప్ప మనసున్న మన అభిమాన నాయకుడు దుద్దిల్ల శ్రీను బాబు  ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబ సమేతంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ దుద్దిళ్ల శ్రీను బాబు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, బీసీ సెల్ ఎస్సి సెల్ మైనారిటీ సెల్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.