– శ్రీరామ్ ఏజెంట్లకు అవగాహన సదస్సులో
– అసిస్టెంట్ ఏరియా మేనేజర్ కొత్తపల్లి ఆనంద్ యాదవ్....
నవతెలంగాణ భువనగిరి: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పై కంపెనీకి సంబంధించిన ఏజెంట్లకు శనివారం అసిస్టెంట్ ఏరియా మేనేజర్ కొత్తపల్లి ఆనంద్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీరామ్ కంపెనీ ఏజెంట్లకు శిక్షణతో పాటుగా, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శనివారం పట్టణ శివారులోని న్యూ దీప్తి హోటల్లో శ్రీరామ్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, జోనల్ మేనేజర్ సంతోష్, ట్రైని సుధాకర్ హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఏరియా మేనేజర్ ఆనంద్ యాదవ్ మాట్లాడుతూ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యతను, ఇన్సూరెన్స్ అవసరాన్ని ఏజెంట్లకు వివరంగా వివరించారు. ఇన్సూరెన్స్ చేయడం వలన ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనకు అండగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండగా ఉండి, ఆర్థిక భరోసానిస్తుందని తెలిపారు. 2006 సంవత్సరం నుంచి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవలందిస్తుందని, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎర్గో మేనేజర్, భువనగిరి బ్రాంచ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ నరేష్ యాదవ్, సైదులు గౌడ్ , కందుల విజయ్ కుమార్ , బాలరాజు, ఏజెంట్ మిత్రులు పాల్గొన్నారు.