శ్రీసేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15న సెలవుదినంగా ప్రకటించాలి

నవతెలంగాణ  – మోపాల్ 

గిరిజన(బంజారా) ఆరాధ్య దైవ గురువు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజైన ఫిబ్రవరి 15న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినం ప్రకటించాలి. సేవాలాల్ మహారాజ్ గిరిజన బంజారా సమాజానికి ఆరాధ్య దైవం అలాగే ప్రతి లంబాడి బంజారా బిడ్డ ఆ రోజున జయంతిని ఎంతో వైభగంగా జరుపుకుంటారు. అలాగే బంజారా సమాజ అభివృద్ధికి చైతన్యానికి కృషిచేసిన మహానీయుడు దేశంలో అన్ని కులాల మతాల వారీగా వారి వారి పండుగలకు సెలవు దినం ఉంది. కానీ గిరిజన బంజారా పండుగకు మాత్రం సెలవు దినం లేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి ఫిబ్రవరి 15 నాడు పురస్కరించుకొని సెలవు దినం ప్రకటించాలి. గతంలో కెసిఆర్ ప్రభుత్వం సేవలాల్ మహారాజ్ జయంతి అని చెప్పి సేవిలాల్ మహారాజ్ జయంతి  మాటలు ప్రకటించి సెలవుదినంగా ప్రకటించలేదు. కాబట్టి ఇప్పుడు మన  ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని మా బంజారా జాతి ప్రజలు మాకు అభివృద్ధి జరుగుతుంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అని నమ్మి మిమ్మల్ని ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మీపై ఎంతో నమ్మకంతోని మా బంజారా ప్రజలు మీకు భారీ మెజారిటీతో గెలిపించినారు కాబట్టి మా బంజారా ప్రజల అభివృద్ధి మరియు సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రకటిస్తారని నమ్మకం మాకు ఉందని భావిస్తూ మా యొక్క సేవలాల్ జయంతిని ఫిబ్రవరి15 తారీకు నాడు సెలవు ప్రకటించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మా యొక్క గిరిజన తండాకులలో గుడాలలో రావాల్సిన నిధులన్నీ సేవలాల్ మారాజు జయంతి రోజున ప్రతి తండాకు నియమించాలని కోరుచున్నాము కేతావత్ సురేష్ నాయక్ పేర్కొన్నారు.