శ్రీస్వయంభు పూర్ణగిరిసుదర్శన లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
మార్చి ఒకటవ తేదీన  భువనగిరి మండలంలోని నమాత్ పల్లి గ్రామంలో  స్వయంభు శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు  దేవాలయ కమిటీ ఛైర్మన్ అతికం లక్ష్మీనారాయణ గౌడ్  తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన పత్రికలు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి   తో పాటుగా, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ప్రభుత్వ విప్,  ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఆహ్వాన పత్రాలు అందజేసినట్లు తెలిపారు. వేద పండితుల చేత కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, అందుకు పాలకమండలి సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు సహకరించాలని కోరారు.