ఇస్సపల్లి గ్రామంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

నవతెలంగాణ – ఆర్మూర్  

మండలంలోని ఇస్సాపల్లి గ్రామంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీలక్ష్మి పద్మావతి వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నేరెళ్ల నరసింహమూర్తి మాట్లాడుతూ.. రామానుజాచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉండడం విశేషమని, ఇక్కడి ఆలయానికి 800 ఏళ్లకు పైగా చరిత్ర ఉందన్నారు. ఇక్కడి దేవాలయం విశిష్టత ఎంతో గొప్పదన్నారు. ఇటువంటి క్షేత్రం తెలంగాణలోనే ప్రత్యేకమైనదని, తిరుపతిలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.