
మండలంలోని సుంకిశాలకు చెందిన ప్రవాస భారతీయులు పైళ్ల మల్లారెడ్డి సాధన గార్ల సౌజన్యంతో నిర్మించిన శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామీ 27 వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారిని అమ్మవార్లను ఎదురుకొని కళ్యాణ వేదిక వద్దకు తోడ్కొని వచ్చి స్వామివారి తిరు కళ్యాణం అంగరంగ వైభవంగా వేదపండితులు శాస్త్రోక్తoగా నిర్వహించారు. ఈ కల్యాణంలో స్వామివారికి మల్లారెడ్డి సోదరులు పైళ్ల అచ్చిరెడ్డి దంపతులు, పైళ్ల రాజిరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. కల్యాణంలో ముఖ్య అతిధిగా స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పైళ్ల సంజీవరెడ్డి దంపతులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ మత్స్యగిరి ఆలయ కమిటీ ఛైర్మెన్ కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి,స్థానిక మార్కెట్ ఛైర్మెన్ భీమా నాయక్, వాకిటి అనంతరెడ్డి, బడుగు సత్యనారాయణ, చిట్టెడి జనార్దన్ రెడ్డి, నూతి రమేష్, పాశం సత్తి రెడ్డి, గుఱ్ఱం లక్మరెడ్డి, తుమ్మల యూగందర్ రెడ్డి,గరిసె రవి,బాతరాజు బాల్ నర్సింహా, బద్దం సంజీవరెడ్డి, పబ్బు ఉపేందర్ బోస్, బోళ్ల శ్రీనివాస్, కంకల కిష్టయ్య,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.