బాధిత కుటుంబాలకు అండగా “ఎస్ఆర్ఆర్”

నవతెలంగాణ – రాయపర్తి
మండల వ్యాప్తంగా బాధిత కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అండగా నిలుస్తుంది. మండలంలోని పన్యా నాయక్ తండాకు చెందిన మాలోత్ సాయమ్మ, శివరామపురం గ్రామానికి చెందిన చెడుపాక దయాకర్ ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు సోమవారం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సారధ్యంలో మండలంలో సేవా కార్యక్రమాలు న భూతో న భవిష్యతి అన్నట్లుగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ అధికార ప్రతినిధి తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, మండల పార్టీ నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, లేతకుల రంగా రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ చెడుపాక కుమార్, నాగపూరి సోమయ్య, జగన్, ఎస్ఆర్ఆర్ ప్రతినిధులు పసునూరి యకూబ్ రెడ్డి, చెడుపాక యాకయ్య, గజవెల్లి ప్రసాద్, కోలా సంపత్, ఎల్లస్వామి, ఎండీ యూసఫ్, విరస్వామి, అంజయ్య, ప్రభాకర్, కృష్ణ మూర్తి, రవి, బందు యాకయ్య, మహేందర్, రాంనర్సయ్య, యాకయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.