డ్రైవర్లకు ఎస్‌ఆర్‌టియు ప్రోత్సాహం

హైదరాబాద్‌: డ్రైవర్స్‌ను డేను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల సంఘం (ఎఎస్‌ఆర్‌టియు) దేశ వ్యాప్తంగా డ్రైవర్లను గౌరవించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది. ఇందులో భాగంగా సురక్షితమైన ప్రజా రవాణాలో అసాధారణ అంకితభావాన్ని ప్రదర్శించిన ఇద్దరు డ్రైవర్లకు రూ.5,000 చొప్పున బహుమతి అందించినట్లు ఎఎస్‌ఆర్‌టియు ఉపాధ్యక్షులు సిహెచ్‌ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు.