
యువత డ్రగ్స్ కు బానిసలుగా మారితే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఎస్సై కిరణ్ రెడ్డి అన్నారు. గంగాధర మండలం న్యాలకొండపల్లి ఆదర్శ పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం డగ్స్ వ్యసనం వల్ల కలిగే దుష్పరిణామాలు, ఎదురయ్యే సమస్యలపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్సై కిరణ్ రెడ్డి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు, మత్తుకు బానిసలుగా మారి మంచి జీవితాన్ని, భవిష్యత్తును కోల్పోవద్దని సూచించారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్ వ్యసనాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, సమాజంలో దురాభిప్రాయం ఏర్పడుతుందని అన్నారు. డగ్స్ తీసుకోవడం వల్ల అనేక సమస్యలను తెచ్చుకోవడం తప్ప ఎటువంటి ప్రయెాజనం లేదన్నారు. డగ్స్ తీసుకుంటూ పట్టుబడితే కేసులు తప్పవని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని చెడు వైపు దృష్టి మరల్చకుండా మంచి మార్గంలో పయనించాలని ఎస్సై కిరణ్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.