ప్రజల్లో చైతన్యాన్ని నింపేందుకే పోలీసుల కళాజాత ఎస్సై రవి గౌడ్‌

నవతెలంగాణ-కొడంగల్‌
ప్రజలను చైతన్య పరచడానికి, వారితో మమేకం కావడానికి పోలీసుల కళాజాత నిర్వహిస్తున్నామని ఎస్‌ఐ రవి గౌడ్‌ అన్నారు, ఎస్పి ఎన్‌. కోటిరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశా లలో విద్యార్థులకు పోలీస్‌ కళాబందం ఆటపాటలతో అవ గాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రదర్శనతో మూఢ నమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, మద్యం సేవించడం వల్ల కలిగే నష్టాలు, బాల్య వివాహాలు, విద్యార్థుల ఆత్మ హత్యలు, సైబర్‌ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరా లు, 100 డయల్‌, మానవ అక్రమ రవాణా, గంజాయి, డ్రగ్స్‌ నిషేధంపై ఆటపాటలతో అవగాహన కల్పించారు, ఎస్‌ఐ రవి గౌడ్‌ మాట్లాడుతూ సైబర్‌ నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలన్నారు, ద్విచ క్రవాహనదారుడు హెల్మెంట్‌ ధరించాలని, కారు నడపే వారు సిటు బెల్టు పెట్టుకోవాలన్నారు. బాల్యవివాహాలు, మూడ నమ్మకాలు నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌, కళాశాల ఉపాధ్యాయ బందం, డబ్ల్యూపిసిఎస్‌ రజియా, లలిత, సాయి ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.