నవతెలంగాణ – తాడ్వాయి
పోలీసులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు, నేరాల శాస్త్రీయతను గుర్తించడం అంతర్గత భద్రత నియంత్రణలో తోడ్పడుతానికి నూతనంగా కాలేశ్వరం జోన్ డ్యూటీ మీట్ ను ప్రారంభించారు. అందుకు ములుగు జిల్లా నుండి తాడ్వాయి ఎస్సై ననుగంటి శ్రీకాంత్ రెడ్డి ఎన్నికయ్యారు. శనివారం జరిగిన కాలేశ్వరం జోన్ లెవెల్ డ్యూటీ మీట్ లో టాప్ స్కోర్ తో మొదటి స్థానం తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సాధించారు. ఆయనను పుష్పగుచ్చం అందించి సత్కరించారు. కాలేశ్వరం జోన్ లెవెల్ డ్యూటీ మీట్లో టాప్ స్కోర్ తో మొదటి స్థానం సాధించిన, కాలేశ్వరం జోన్ తరఫున తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2024లో ప్రథమ స్థానం సాధించినందుకు, పలువురు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.