నవతెలంగాణ – తాడ్వాయి
సైబర్ నేరాలపై విద్యార్థినిలు అవగాహన పెంచుకోవాలని, ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటీంల కు సమాచారం అందించాలని తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచించారు. సైబర్ నేరాలు షీ టీమ్ లపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నీ విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. అనంతరం 55 మంది విద్యార్థినీలకు జనరల్ నాలెడ్జ్ (జీకే) బుక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినిలు సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రుల కలల సహకారం చేయాలని సూచించారు. మహిళలు విద్యార్థినిల రక్షణ కోసం షీ టీం ఏర్పాటు చేశామని, ఏదైనా ఆపదలో ఉంటే 100 నెంబర్ కు డయల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మోసాలకు గురైతే 1930 నెంబర్ కు డయల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పిసీ లు పూజారి రమేష్, సంజయ్ నంద, స్వాతి, విద్యార్థినిలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.