పోగొట్టుకున్న ఫోను వెతికి అందజేసిన ఎస్సై సుధాకర్

నవతెలంగాణ – రామారెడ్డి
పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను వెతికి శనివారం ఎస్సై సుధాకర్ బాధితురాలకు అందజేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి కి చెందిన కుమ్మరి రాజమణి, రామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర)లో అటెండర్ గా పని చేస్తూ, గురువారం సెల్ ఫోను పోగొట్టుకొని, అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సి ఈ ఐ ఆర్ ద్వారా మొబైల్ ను ట్రేస్ చేసి, బాధితురాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజమణి, ఎస్సై సుధాకర్ కు, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.