పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేసిన : ఎస్సై సుధాకర్

నవ తెలంగాణ –  రామారెడ్డి
 మండలంలో పలువురు పోగొట్టుకున్న సెల్ఫోన్లను శనివారం ఎస్సై సుధాకర్ అందజేశారు. రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన లింగాల కౌసల్య, తోట నితీష్, అన్నారం గ్రామానికి చెందిన జల్లగడుగుల రాజయ్య సెల్ ఫోన్లను పోగొట్టుకొని, మరుసటి రోజు బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  పోలీసులు సిఈఐఆర్ ద్వారా ఫోన్ ట్రేస్ చేసి పోగొట్టుకున్న సెల్ ఫోన్లను తిరిగి బాధితులకు ఎస్ఐ అందజేశారు. ఈ సందర్భంగా వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.