
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోస్ర పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నగరంలోని నిఖిల్ సాయి హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఆనాటి చదువు చెప్పిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. మండల విద్యాధికారి నాగయ్య సార్ మాట్లాడుతూ. 28 సంవత్సరాల తర్వాత అందరూ ఒక తాటిపై కలయిక వలన ఈ కార్యక్రమం నిర్వహించడంతో చాలా సంతోషంగా ఉందని అన్నారు. తమకు చదువు చెప్పిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఎదగడమే మాకు చాలా ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, గంగారెడ్డి, గణేష్, లక్ష్మణ్, మొగులయ్య, శంకర్ గౌడ్, వెంకటరెడ్డి, రవీందర్, స్వప్న, సుధాకర్ రెడ్డి, కవిత, సంగీత, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.