
మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన ఎస్ఎస్సి ప్రాణ స్నేహితునికి మిత్రులు ఆర్థిక సహాయాన్ని బుధవారం అందించారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామ జడ్పీహెచ్ఎస్ స్కూల్ 1997- 98 బ్యాచ్ కు సంబంధించిన మిత్ర బృందం తమతో పదో తరగతి వరకు చదివి గత సంవత్సరం కింద మరణించిన తమ ప్రాణ మిత్రుడు షాదుల్లా కుటుంబం దీనస్థితిలో ఉందని తెలుసుకొని వారి కుటుంబానికి రూ.37,500 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని అతని మిత్రుడు తెలియజేశారు. స్నేహితుని కుటుంబానికి మేమున్నామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో చింత మహేష్ (టిఆర్ఎస్) , సంఘం మహిపాల్, పెద్ది రాజు, ప్రవీణ్ కుమార్, బేల్దారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.